November 12, 2019

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ – నలుగురు పరారీ – 13 దుంగలు స్వాధీనం

Clock Of Nellore ( Rapur ) – నెల్లూరు జిల్లాలోని వెలుగొండ అడవుల నుండి ఎంతో విలువైన ఎర్ర చందనం సంపదను దోపిడీ చేస్తున్న ముఠాపై మెరుపు దాడి నిర్వహించారు రాపూరు పోలీసులు. ఈ మెరుపు దాడిలో నలుగురు పరారయ్యారు. ప్రధాన ముద్దాయి పోలీసులకు చిక్కాడు. ఆదివారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు రాపూరు ఎస్సైలు కోటిరెడ్డి, స్వప్నలు మంగలోళ్ల బావి వద్ద, పెంచలకోన – తెగచెర్ల రోడ్డు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ప్రధాన ముద్దాయి పొదలకూరుకు చెందిన చప్పల శంకరయ్య పట్టుబడగా, ముఠాలోని యాకసిరి అంజయ్య, నల్లు నరసింహులు, మల్లిక ప్రసాద్, తమిళనాడుకు చెందిన రసూల్ దుంగలను అక్కడ పడేసి పరారయ్యారు. పోలీసులు 13 దుంగలను స్వాధీనం చేసుకుని శంకరయ్యను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాపూరు పోలీస్ స్టేషన్ లో వెంకటగిరి సిఐ అన్వర్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. పట్టుబడ్డ 13 ఎర్ర చందనం దుంగల విలువ 2లక్షల రూపాయల వరకూ ఉంటుందని చెప్పారు. ఈ కేసులో నలుగుర్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సైలు కోటిరెడ్డి, స్వప్న పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!