November 22, 2019

నెల్లూరుజిల్లాలో భారీ వర్షం – మరో 24 గంటల పాటూ కొనసాగే అవకాశం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుతో పాటూ కడప, చిత్తూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధవారం ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరుజిల్లాక సంభందించి గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం భారీ వర్షం కురవగా మధ్యాహ్నం 12 గంటలకు అది స్వల్పంగా తగ్గింది. 3 గంటల తర్వాత మళ్లీ భారీ వర్షంగా మారింది. 3 గంటల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. మరో వైపు ఈ వర్షం కారణంగా నెల్లూరు నగరంలో రోడ్లు జలమయంగా మారాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లు తున్నాయి. మరో 24 గంటల పాటూ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!