November 16, 2019

బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం – నిందితుల అరెస్ట్ – తల్లిదండ్రుల చెంతకు చిన్నారి

Clock Of Nellore ( Kavali ) – నెల్లూరుజిల్లా కావలి వద్ద శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో కిడ్నాప్ అయిన రెండు నెలల శిశువు ఉదంతం సుఖాంతమైంది. రైల్వే పోలీసులు చాకచక్యంగా విచారణ చేపట్టి నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లో కెళ్తే… పశ్చిమ గోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం, ఆరుళ్ల గ్రామానికి చెందిన వేముల గోపి భార్య కృష్ణవేణి వారి ఇద్దరు పెద్ద పిల్లలు మరో రెండు నెలల చిన్నారితో కలిసి ఈనెల 5వ తేదీనా తణుకులో శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. జనరల్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తున్న వీరితో అక్కడే ఉన్న అపరిచిత మహిళలు పరిచయం పెంచుకున్నారు. రైలు నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చే సరికి వారు నిద్రిస్తుండగా రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. 6వ తేదీ ఉదయం కావలి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సిసి టీవి ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. చివరకు వారు కృష్ణాజిల్లాలోని నూజివీడులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి నిందుతులిద్దరనీ అదుపులోకి తీసుకున్నారు. వారు తిరుపతికి చెందిన షేక్ బీబీ, షేక్ నాగుర్భీగా గుర్తించారు. కిడ్నాప్ అనంతరం నూజివీడులోని వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. దీంతో వారిని అరెస్ట్ చేసి చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసును ఛేదించిన నెల్లూరు రైల్వే సిఐ మంగారావు, ఒంగోలు రైల్వే సిఐ రామారావు, కావలి రైల్వే ఎస్సై మాలకొండయయ్ వారి సిబ్బందిని గుంతకల్లు రైల్వే ఎస్పీ అభినందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!