November 21, 2019

కిడ్నాప్ అయిన బాలిక కోసం పోలీసుల గాలింపు – బాలికను ఎత్తుకెళ్లిన మహిళ గుర్తింపు

Clock Of Nellore ( Kavali ) – నెల్లూరుజిల్లాలో బుధవారం కిడ్నాప్ అయిన రెండు నెలల చిన్నారి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న గోపి – కృష్ణవేణి దంపతులు నిద్రిస్తున్న సమయంలో పక్కనే కూర్చొని ఉన్న ఓ మహిళ బిడ్డను కిడ్నాప్ చేసింది. అర్ధరాత్రి ఊయలలో నిద్రిస్తున్న బిడ్డను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి కావలి రైల్వే స్టేషన్ లో దిగి వెళ్లిపోయింది. మెలుకువ వచ్చి చూసేసరికి బిడ్డ లేకపోవడంతో గోపి – కృష్ణవేణి దంపతులు కావలి పోలీసులను ఆశ్రయించారు. కావలి పోలీసులు బృందాలుగా ఏర్పడి బిడ్డ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరో వైపు కావలి రైల్వే స్టేషన్ లో సిసి టివి ఫుటేజీని పరిశీలించగా మహిళ బిడ్డను తీసుకొని స్టేషన్ నుండి బయటకు వెళ్లి అక్కడి నుండి ఆటోలో ఆర్టీసీ బస్ స్టేషన్ కు వెళ్లినట్లు తెలిసింది. మహిళ ముఖం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆమె పట్టుకోవడం సులభం అని పోలీసులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో కందుకూరు వైపు వెళ్లినట్లు తేలింది. ఆమె కోసం కందుకూరు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!