November 22, 2019

నెల్లూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు – ఆయుధాలపై విద్యార్ధులకు అవగాహన

Clock Of Nellore ( Nellore ) – దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన నిర్వహించుకునే పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మెగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్రైం విభాగం అదనపు ఎస్పీ మనోహర్ రావు ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి 18 మంది పోలీసు అధికారులు, 42 మంది సిబ్బందికి మొత్తం 60 మందికి రెండు క్యాటగిరీలుగా విభజించి “నవ్యాంధ్ర అభివృద్దిలో పోలీసు పాత్ర- పోలీసు-ప్రజల భాగస్వామ్య ఆవశ్యకత” అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. అదేవిధంగా ఆత్మకూరు టౌన్, ఉదయగిరి, వెంకటాచలం మరియు బుచ్చి లలో రక్తదాన శిబిరాలను చేపట్టారు.ఉదయం 6.30 గంటలకు సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలో రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఉమేష్ చంద్రా కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ-విద్యార్థులకు హాజరుకాగా వారికి ఆయుధాలు ప్రదర్శన వాటి పనితీరు, బాంబు డిస్పోజల్, ఫింగర్ ప్రింట్, డ్రోన్ కెమెరాలు, కమ్యూనికేషన్, రైట్ గేర్, స్టేషన్ రికార్డ్స్ గురించి నవాబ్ పేట సిఐ వేమారెడ్డి మరియు వారి సిబ్బంది అవగాహన కల్పించి వాటి ఉపయోగాల గురించి క్షుణ్ణంగా వివరించారు. అలాగే సాయంత్రం 5 గంటలకు పోలీసుల పనితీరుపై ప్రజల అభిప్రాయం మరియు విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాలులు అనే అంశంపై ఇన్స్పెక్టర్ లు వివిధ వర్గాల ప్రజలతో కలిసి వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ యస్.పి.(క్రైమ్స్)తో పాటు డి.పి.ఒ. (అడ్మిన్) డి.యస్.పి. శ్రీ లక్ష్మీనారాయణ, యస్.డి.పి.ఒ. నెల్లూరు టౌన్ శ్రీ జె.శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు రూరల్ యస్.డి.పి.ఒ. శ్రీ కె.వి. రాఘవ రెడ్డి, ట్రాఫిక్ డి.యస్.పి. పి. మల్లికార్జున రావు, డి.యస్.పి.(ఎ.ఆర్.) శ్రీ వై.రవీందర్ రెడ్డి గార్లు, టౌన్ ఇన్స్పెక్టర్ లు, ఆర్.ఐ.లు, పోలీసు సంఘం అధ్యక్షులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!