November 19, 2019

అయోధ్య కేసు తీర్పు నేపద్యంలో నెల్లూరుజిల్లాలో పోలీస్ అప్రమత్తం

Clock Of Nellore ( Nellore ) – అయోధ్య రామమందిర కేసు తీర్పు నేపద్యంలో నెల్లూరుజిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. జిల్లా అంతటా ఈనెల 11వ తేదీ వరకూ 144 సెక్షన్ ను విధించారు. ఎవ్వరూ గుమిగూడి ఉండరాదని ఎస్పీ హెచ్చరించారు. అనుమతి లేకుండా ఊరేగింపులు చేపట్టరాదని, బాణా సంచా కాల్చరాదని చెప్పారు. జిల్లాలోని వివాదస్పద ప్రాంతాల్లో పోలీసులను మోహరింపజేశారు. నెల్లూరు నగరంతో పాటూ జిల్లాలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై అందరూ సంసయనం పాటించాలని పోలీసులు కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!