November 19, 2019

నెల్లూరుజిల్లాలో కొనసాగుతున్న పోలీస్ అమర వీరుల వారోత్సవాలు – వర్క్ షాపులు, సెమినార్ ల నిర్వహణ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖపై ప్రజలకు అవగాహన కల్పించే వర్క్ షాపులు, సెమినార్ లతో పాటూ ఓపెన్ హౌస్ కార్యక్రమాలను చేపట్టి పోలీస్ విధులు, విభాగాలు, ఆయుధాలపై విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా వృత్తి పరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్ధులతో చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం తదితర అంశాలపై ఈ కార్యక్రమాల్లో చర్చించారు. పోలీసులు కూడా ప్రజల్లో భాగమేనని, స్టేషన్ కు రావాలంటే ఓ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!