November 16, 2019

బ్రాందీషాపు ఏర్పాటుపై ఆత్మకూరులో కొనసాగుతున్న నిరసనలు, అరెస్టులు

Clock Of Nellore ( Atmakur ) – బ్రాందీ షాపు ఏర్పాటుపై గత నాలుగు రోజులుగా ఆత్మకూరులో నిరసనలు కొనసాగుతున్నాయి. గత నెల 30వ తేదీనా స్థానిక ఏసిఎస్ఆర్ కాలనీలో బ్రాందీ షాపు ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు పనులు మొదలు పెట్టగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. మహిళలు షాపుకు అడ్డంగా పడుకుని ఈ ప్రాంతంలో బ్రాందీ షాపు వద్దని నినదించారు. ఈనెల 1వ తేదీనా మహిళలు పెద్ద ఎత్తున అక్కడ నిరసన వ్యక్తం చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈనెల 2వ తేదీ కూడా అదే పరిస్థితి కొందలు మహిళలు అక్కడే స్కృహ తప్పి పడిపోయారు. తాజాగా గురువారం కూడా మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో బ్రాందీషాపు ఏంటని ప్రశ్నించారు. బ్రాందీ షాపు తొలగించే వరకూ నిరసన కొనసాగుతుందని షాపు ఎదుటే బైటాయించారు. దీంతో మళ్లీ రంగ ప్రవేశం చేసిన పోలీసులు మహిళలను అక్కడి నుండి పంపించి వేశారు. కొందరు స్థానిక పురుషులు కూడా వీరి నిరసనకు మద్దతు పలిగి షాపు ముందు బైటాయించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ ప్రాంతంలో బ్రాందీషాపు ఏర్పాటుపై గత ఏడాది నుండి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అదే షాపులో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలు చేపట్టడంతో ప్రజలు ఎదురుతిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!