November 22, 2019

వ్యభిచార గృహ నిర్వాహకుల అరెస్ట్ – ముగ్గురు యువతులకు విముక్తి

Clock Of Nellore ( Nellore ) – నివాసం పేరుతో అపార్ట్ మెంట్ లో ఉంటూ ముగ్గురు యువతులచే వ్యభిచారం చేయిస్తున్న మహిళను నెల్లూరులోని బాలాజీనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నెల్లూరు హరనాథపురంకు చెందిన 70 ఏళ్ల దాసరి శాంతమ్మ అనే మహిళ హరనాథపురంలోని పీపుల్స్ పార్కు రోడ్డులో డేగ అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెంబర్ జి-8లో ఉంటోంది. బయట ప్రాంతాల నుండి ముగ్గురు యువతులను అపార్ట్ మెంట్ కు తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వారిచే వ్యభిచారం చేయిస్తుంది. విటువు రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా అపార్ట్ మెంటు కు వచ్చిపోతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన బాలాజీనగర్ సిఐ సోమయ్య, ఎస్సైలు పవన్ కుమార్, వీర ప్రతాప్ వారి సిబ్బంది శనివారం ఉదయం వారి నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కలువాయి మండలానికి చెందిన కంచర్ల పెంచలయ్య అనే విటుడితో పాటూ ముగ్గురు యువతులు అక్కడున్నారు. పోలీసులు యువతులను ప్రశ్నించగా నెలకు కొంత మేర తమకు నగదు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని తెలియజేశారు. ఇంట్లో తనిఖీలు చేపట్టగా కండోమ్ ప్యాకెట్లు లభ్యమైనాయి. దీంతో వ్యభిచారం గృహ నిర్వాహకులు దాసరి శాంతమ్మతో పాటూ విటుడు కంచెర్ల పెంచలయ్యలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుండి కండోమ్ ప్యాకెట్లు, రెండు సెల్ ఫోన్లు, 4800 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. వ్యభిచారం కోసం తీసుకొచ్చిన ముగ్గురు యువతులకు అక్కడి నుండి విముక్తి కల్పించారు. సిఐ సోమయ్య విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!