January 23, 2020

ఏసి స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు – బహుమతులు అందజేసిన ఏఎస్పీ

Clock Of Nellore ( Nellore ) – క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటూ శరీర శౌష్ఠవాన్ని పెంపొందించుకోవచ్చునని క్రైం విభాగం జిల్లా అదనపు ఎస్పీ పి. మనోహర్ రావు అన్నారు. నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో నెహ్రూ యువ కేంద్రం మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కబడ్డీ, వాలీబాల్ పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విజేతలకు గోల్డ్ మెడల్స్, షీల్డ్, ప్రశంసా పత్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మనోహర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటూ కళలు, క్రీడల పట్ట విద్యార్ధులు మక్కువ చూపాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటూ ఆనందం కూడా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి సుస్మితా రెడ్డి, నెహ్రూ యువకేంద్రం యూత్ కో- ఆర్డినేటర్ ఆకుల మహేంద్ర రెడ్డి, దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్.కే. కాలేషా, ఎస్.వి.ఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందె శ్రీనివాసులు, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!