November 19, 2019

పాకిస్తాన్ రికార్డును బ్రేక్ చేసిన సింహపురి కరాటే వీరుడు – గిన్నిస్ రికార్డు కోసం సాహసం

Clock Of Nellore ( Nellore ) – రెండు విభాగాల్లో ఇప్పటి వరకూ పాకిస్తాన్ పౌరుడి పేరుతో ఉన్న రెండు గిన్నిస్ రికార్డులను బ్రేక్ చేశాడు సింహపురి కరాటే యోధుడు. నెల్లూరుకు చెందిన కరాట్ మాస్టర్ షేక్ ఇబ్రహీం పలువురు ప్రతినిధులు, మీడియా సమక్షంలో పాకిస్తాన్ రికార్డులను అధిగమించారు. నెల్లూరులోని హరనాథపురంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకూ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్యాడ్ పై పంచ్ లు, ట్రెడిషినల్ స్టిక్ పంచ్ లకు సంభందించిన పాకిస్తాన్ కు చెందిన మహ్మద్ రషీద్ అనే వ్యక్తి పేరుతో ఉన్నాయి. ప్యాడ్ పై పంచ్ లు నిముషానికి 428 కొట్టి గిన్నిస్ రికార్డు సాధించాడు. అదే ప్యాడ్ పంచ్ పై నెల్లూరుకు చెందిన ఇబ్రహీం నిముషానికి 450 కొట్టి పాకిస్తాన్ రికార్డును బ్రేక్ చేశారు. అలాగే ట్రెడిషినల్ స్టిక్ పంచ్ కు సంభందించి పాకిస్తాన్ వ్యక్తి నిముషానికి 394 కొట్టగా, ఇబ్రహీం నిముషానికి 422 కొట్టి పాకిస్తాన్ ను బీట్ చేశాడు. ఈ వీడియోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులకు పంపుతున్నట్లు ఇబ్రహీం వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!