November 19, 2019

నెల్లూరుజిల్లా క్రైం ఏఎస్పీగా మనోహర్ రావు నియామకం – ఉత్తర్వులు జారీ చేసిన డిజిపి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా క్రైం విభాగం అదనపు ఎస్పీగా పి. మనోహర్ రావు ను నియమిస్తూ డిజిపి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటూ వెయిటింగ్ లో ఉన్న మరో 5 మందికి కూడా పోస్టింగులు కేటాయించారు. గత కొంత కాలంగా నెల్లూరు క్రైం విభాగం అదనపు ఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఏఎస్పీగా విఠలేశ్వర రావు పనిచేశారు. ఆయన బదిలీ తర్వాత ఇంఛార్జ్ లతోనే కొనసాగుతుంది. తాజాగా వెయిటింగ్ లో ఉన్న పి. మనోహర్ రావును డిజిపి నియమించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!