November 21, 2019

నెల్లూరుజిల్లాలో పొంగిపొర్లుతున్న బొగ్గేరు – ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు

Clock Of Nellore ( Marripadu ) – నెల్లూరుజిల్లాలోని మర్రిపాడు మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో సన్నావారిపల్లిలోని బొగ్గేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత అయిదేళ్ల నుండి చుక్కనీరు లేకుండా దర్శనమిచ్చిన బొగ్గేరులో ఒక్కసారిగా వరద వచ్చి చేరడంతో చుట్టుపక్క ప్రాంతాల వారు బొగ్గేరు ప్రవాహాన్ని చూడటానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే బొగ్గేరు ప్రవాహం ఎక్కువైతే చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరమని తెలిసినా బొగ్గేరు ప్రవాహంలోనే తప్పని పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. బొగ్గేరు పొంగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్లడానికి వీలు లేకుండా ఉంటుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వంతెనను హైలెవల్ చేస్తే కానీ తమ కష్టాలు తీరవని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!