November 16, 2019

గూడూరులో గుర్తు తెలియని వాహనం ఢీ – వాచ్ మెన్ మృతి

Clock Of Nellore ( Gudur ) – గూడూరు రూరల్ పరిధిలోని ఎస్.ఎస్.వి స్కూల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న పమజుల దయాకర్ అనే వ్యక్తి సోమవారం తెల్లవారు జామున ఎస్.ఎస్.వి స్కూల్ రోడ్డులోకి వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆయన్ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ దయాకర్ అక్కడికక్కడే మరణించారు. మరో వైపు ప్రమాదం జరిగిన సమయంలో చీకటిగానే ఉండటంతో ఆ ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో పలు వాహనాలు ఆయన మృతదేహంపై వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమైంది. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!