November 21, 2019

నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం – ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం

Clock Of Nellore ( Amaravathi ) – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మళ్లీ ఐదేళ్ల తరువాత పండగొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఒక్క ఏడాది కూడా నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. అయితే గత ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు ఆ విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని తెలిపింది. అయితే గత టిడిపి ప్రభుత్వం దాని స్థానే జూన్‌ 2న నవనిర్మాణ దీక్షలు చేపట్టింది. తాజాగా వైసీపి ప్రభుత్వం నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్‌ ఈ నెల 21న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!