November 19, 2019

నెల్లూరులో ఘనంగా మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి జయంతి – నివాళులు అర్పించిన మయూర్

Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. ఆయన మనుమడు, మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రామలింగాపురం సర్కిల్ లో ఉన్న ఆనం వెంకటరెడ్డి విగ్రహానికి రంగ మయూర్ రెడ్డితో పాటూ వైసీపి నేతలు, వారి కుటుంబ సన్నిహితలు కొడవలూరు ధనుంజయరెడ్డి, చాట్ల నరసింహారావు, షమీమ్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగమయూర్ రెడ్డి మాట్లాడుతూ జీవించినంత కాలం ప్రజలే కోసమే పనిచేసిన నేత వెంకటరెడ్డి అన్నారు. స్వర్గీయ ఏసి సుబ్బారెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వెంకటరెడ్డి ఆయన తరహాలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలు తీర్చేవారని గుర్తు చేశారు. తనతో పాటూ ప్రజా సేవ నిలిచిపోకూడదనే ఆయన నలుగురు కుమారుడు రాజకీయాల్లో రాణించారని స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. అలాగే ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా, శాసనసభ్యునిగా సేవలందించి నేడు వెంకటగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి ఆశయాల కోసం ఆనం కుటుంబం పనిచేస్తుందని మయూర్ స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!