November 19, 2019

నెల్లూరులో సిఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యేలు – పలు సూచనలు

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీనా నెల్లూరు పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. నెల్లూరు నుండే ఆయన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని కోసం కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో సభా ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు అధికారులు. గురువారం సాయంత్రం ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. సభా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, భద్రతా పరమైన విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ఏర్పాట్లను ఎమ్మెల్యేలకు వివరించారు. ఎమ్మెల్యేలు వారికి పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!