November 16, 2019

నెల్లూరులో గుట్కా వ్యాపారి అరెస్ట్ – 3లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Clock Of Nellore ( Nellore ) – బెంగుళూరు నుండి నిషేదిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను నెల్లూరుకు తరలించి ఇక్కడి నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఉప్పుశెట్టి రవి అనే వ్యక్తిని నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 3లక్షల రూపాయల విలువైన గుట్కా ఫ్యాకెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబునగర్ లో నివాస ముండే ఉప్పుశెట్టి రవి పెద్ద ఎత్తున గుట్కాలను తీసుకొచ్చి అమ్ముతున్నాడని సమాచారం అందుకున్న వేదాయపాళెం సిఐ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం వారి నివాసాన్ని తనిఖీ చేశారు. నివాసంలో వేల సంఖ్యలో గుట్కా ప్యాకెట్లు లభ్యమైనాయి. రవిని అదుపులోకి తీసుకుని విచారించగా బెంగుళూరులో నజీర్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన పోలీసులు రవిని మంగళవారం అరెస్ట్ చేశారు. సిఐ సుబ్బారావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!