November 19, 2019

భార్యతో అక్రమ సంబంధం – మందలించినా వినని ప్రియుడు – చివరకు హత్య చేసిన భర్త

Clock Of Nellore ( Nellore ) – వరుసకు బంధువైన యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎన్ని సార్లు మందలించినా మాట వినలేదు. చివరకు ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త ప్రియుణ్ని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. నెల్లూరుజిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంభందించి పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. వివరాల్లో కెళ్తే… నెల్లూరు కోటమిట్టకు చెందిన ఏటూరి సురేష్ కు, కొత్తూరు రోడ్డులోని టైలర్స్ కాలనీకి చెందిన పొదిలి మాదేష్ అనే యువకుడికి బంధుత్వం ఉంది. ఈ క్రమంలో పొదిలి మాదేష్… సురేష్ ఇంటికి వస్తూ పోతూ అతని భార్య సునందతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సురేష్ అనేక మార్లు భార్య సునందను మందలించాడు. అయినప్పటికీ సునంద తీరుమార్చుకోలేదు. ఈ క్రమంలో పొదిలి మాదేష్, సునంద ఇద్దరు ఇంటి నుండి పరారయ్యారు. విషయాన్ని గ్రహించిన సునంద భర్త సురేష్ వారి కోసం వెదికారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీనా ఇద్దరూ విజయవాడ వెళ్తున్నారని తెలుసుకుని స్నేహితుల సహాయంతో పడుగుపాడు వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సును ఆపి ఇద్దర్నీ టైలర్స్ కాలనీలోని మాదేష్ నివాసానికి తీసుకెళ్లారు. భార్య సునందను ఆమె ప్రియుడు మాదేష్ ను కొట్టారు. తరువాత స్నేహితులతో కలిసి మాదేష్ ను బుజబుజనెల్లూరు చెరువు కల్వర్ట్ వద్దకు తీసుకెళ్లి తలపై బండరాయితో మోది హత్య చేశారు. తరువాత ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన వేదాయపాళెం పోలీసులు శనివారం ముద్దాయిలను అరెస్ట్ చేశారు. సునంద భర్త ఏటూరు సురేష్ తో పాటూ అతని స్నేహితులు వేములపాటి సురేష్, షేక్ అక్భర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో వేదాయపాళెం సిఐ సుబ్బారావు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!