November 19, 2019

చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు – పోలీసులకు ఫిర్యాదు చేసిన టిఎన్ఎస్ఎఫ్ నేతలు

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అభ్యంతకర రీతిలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరులోని బాలాజీనగర్ పోలీసులకు టిఎన్ఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు, ప్రధాన కార్యదర్శి అమృల్లా వారి కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదును సమర్పించారు. చంద్రబాబుపై సోషన్ మీడియాలో పెట్టిన పోస్టుల జెరాక్స్ ప్రతులను కూడా ఫిర్యాదుకు జోడించారు. పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అనంతరం తిరుమల నాయుడు మాట్లాడుతూ వైసీపికి చెందిన కొందరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు చనిపోయినట్లు, చంద్రబాబు ఫోటోను మార్ఫింగ్ చేసి కుక్క తలకాయకు పెట్టి పోస్టులు పెడుతున్నారని వివరించారు. వెంటనే ఆ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఈ పోస్టులపై జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!