November 19, 2019

కోటంరెడ్డి సూచన మేరకు ఉన్నత స్థాయి కమిటిని వేయండి – ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్

Clock Of Nellore ( Nellore ) – వెంకటాచలం ఎమ్పీడిఓ సరళ నివాసంపై దౌర్జన్యం కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఉన్నత స్థాయి కమిటిని వేసి విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ కేసుకు సంభందించి వైసీపి ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఎమ్పీడిఓను పిలిపించి నిజాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డిని, కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలిపించి రాజీ చేయడం ఏంటని ప్రశ్నించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని దానిపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కోరారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందో అర్ధం చేసుకోవచ్చునని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమేయం ఖచ్చితంగా ఉందని, అది తేలాలంటే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. తెలుగుదేశంపార్టీకి చెందిన టిఎమ్ఎస్ఎఫ్ అధ్యక్షులు కాకార్ల తిరుమల నాయుడుపై దాడి జరిగినప్పుడు వారు కుటుంబసభ్యులు న్యాయం కోసం ధర్నా చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారని అదే ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ సమయంలో ధర్నా చేసిన వారి కుటుంబసభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఎమ్పీడిఓ కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి విజ్ఞప్తి మేరకు ఉన్నత స్థాయి కమిటిచే విచారణ జరిపిస్తే నిజనిజాలు బయటకు వస్తాయని ఆనం పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!