November 22, 2019

ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోండి – కలెక్టర్ ను కోరిన టిడిపి అధికార ప్రతినిధి ఏవిఆర్

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో ఎదేచ్ఛగా సాగుతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరుజిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కలెక్టర్ శేషగిరి బాబు ను కోరారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గడచిన 3నెలల కాలంలో అనేక దఫాలు ఇసుక విధానాలను మార్పులు చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇసుక లభ్యం కాక ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ట్రాక్టర్లకే మరిమితం అని చెబుతున్న పొట్టే పాళెం ఇసుక రీచ్ నుండి గత నాలుగు నెలల కాలంలో అక్రమంగా తరలించిన ఇసుకకు భాధ్యులెవరని ప్రశ్నించారు. దానికి బాధ్యులెవరో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఏవిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇసుక రీచ్ ల నుండి అక్రమంగా ఇసుక ఎలా తరలిపోతుందని దీని వెనుక ప్రజా ప్రతినిధులు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇసుక మాఫియా ముసుగు తొలగించాలని వెంకటరమణారెడ్డి కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!