January 23, 2020

సంస్థాగత ఎన్నికలపై బీదా సమీక్ష – త్వరగా పూర్తి చేయాలని అనుబంధ సంఘాలకు ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆపార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర నేతలను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో అనుబంధ సంఘాలైన తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాలు, యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన ముఖ్య నేతలకు ఒక్కో నియోజకవర్గ బాధ్యతలు కేటాయిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పరిగణలోని తీసుకోవాల్సిన అంశాలను, సామాజిక కోణాలను తెలియజేశారు. పార్టీ అనుబంధ సంఘాల సంస్థాగత ఎన్నికల కమిటీల నియామకాల్లో వెనుకబడి ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్ఠి సారించాలని బీదా రవిచంద్ర పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే మనస్తత్వం కలిగి, చురుగ్గా వ్యవహరించే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మైన్ చెంచలబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!