November 12, 2019

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీరుపై టిడిపి నిరసన – చర్యలు తీసుకోవాలని డిమాండ్

Clock Of Nellore ( Nellore ) – వెంకటాచలం ఎమ్పీడీఓ సరళ నివాసంలోకి వెళ్లి దౌర్జన్యం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశంపార్టీ నేతలు నెల్లూరులో నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ అబ్ధుల్ అజీజ్ ఆధ్వర్యంలో నేతలు ఆనం వెంకట రమణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇతర కార్యకర్తలు విఆర్సీ సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. టిడిపి నేతలకు భద్రత లేకుండా పోతుందని అన్నారు. నేడు ప్రభుత్వ అధికారులకు కూడా భద్రత లేకుండా పోయిందన్నారు. ఎమ్పీడిఓ పై దౌర్జన్యం చేసిన కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!