November 19, 2019

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయండి – టిడిపి నేతల డిమాండ్

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిపాలనను గాలికొదిలి రౌడీయిజాన్ని మొదలు పెట్టిందని నెల్లూరుజిల్లా టిడిపి నేతలు విమర్శించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మేయర్ అబ్ధుల్ అజీజ్, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, నుడా మాజీ ఛైర్మైన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విలేకరులతో మాట్లాడారు. వెంకటాచలం ఎమ్పీడిఓ సరళ ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం చేయడం దురదృష్ఠకరమని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదటి నుండి దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలపై దాడులు కూడా చేయించారన్నారు. విలేకరులను కూడా టార్గెట్ చేశారని వెల్లడించారు. తాజాగా అధికారులపై దౌర్జన్యం చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. తాము మొదటి నుండి పోలీసులకు చెబుతున్నా పట్టించుకోలేదని ఇప్పటికైనా కోటంరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు కూడా భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారం ఒక్కరికే సాధ్యం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తించి పనిచేయాలని సూచించారు. ఒక ఎమ్పీడిఓ రాత్రి నుండి ఉదయం వరకూ పోలీస్ స్టేషన్ లో ఉంటే కేసు నమోదు చేయరా అని పోలీసులను ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలాగే వ్యవహరిస్తే టిడిపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!