November 19, 2019

నెల్లూరుసిటీలో మొదలైన వలసలు – వైసీపిలో చేరిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బాలాజీ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఖాళీ అయ్యే దిశలో ఉండగా… నెల్లూరు సిటిలో కూడా అది మొదలైంది. ఎన్నికల తర్వాత సిటీ నియోజకవర్గంలోని చాలా మంది టిడిపి నేతలు వైసీపి కండువా కప్పుకునేందుకు ఉత్సాహం చూపగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అనీల్ ఎందుకో వేచిచూసే ధోరణిని ప్రదర్శించారు. రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిని దాదాపుగా ఖాళీ చేసేశారు. ఈ నేపద్యంలో సిటీలో ఆ పని మొదలు పెట్టారు మంత్రి అనీల్. టిడిపి నుండి వచ్చే నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి కువ్వారపు బాలాజీని వైసీపిలోకి ఆహ్వానించారు. 9వ డివిజన్ నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా మంత్రి కార్యాలయం వెనుక ఉన్న కళ్యాణ మండపానికి చేరుకున్న బాలాజీ వైసీపిలో చేరిపోయారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆయనకు వారి అనుచరులకు పార్టీ కండువాలు వేసి వైసిపిలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ నిబద్ధత గల రాజకీయానికి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఉదాహరణ అని అన్నారు. నెల్లూరు ప్రజలకు అనీల్ అంటే ఎంతో అభిమానమని అందువల్లే టిడిపి అభ్యర్ది కోట్లు కుమ్మరించినా ప్రజలు తిరస్కరించారన్నారు. అందుకే ప్రజల అభిమానాన్ని చూరగొన్న అనీల్ కుమార్ యాదవ్ మద్దతుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బాలాజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయా డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!