November 16, 2019

పూర్తయిన బెడవాడ ఓబుల్ రెడ్డి అంత్యక్రియలు – హాజరైన రాజకీయ ప్రముఖులు

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ ఓబుల్ రెడ్డి అనారోగ్యంతో బుధవారం నెల్లూరులో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం ఉదయం కుటుంబసభ్యులు నిర్వహించారు. నెల్లూరు దర్గామిట్టలోని వారి నివాసం వద్ద ఉన్న ఓబుల్ రెడ్డి భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించారు. నిన్నటి నుండి టిడిపి నేతలు అక్కడే ఉన్నారు. గురువారం ఉదయం మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి తదితర నేతలు ఓబుల్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రత్యేక వాహనంలో ఓబుల్ రెడ్డి భౌతిక కాయాన్ని బోడిగాడితోట స్మశాన వాటిక వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలను పూర్తి చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!