November 16, 2019

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు – అధికారి నివాసంపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిపై నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యేతో పాటూ వారి అనుచరులు తన నివాసంపై దౌర్జన్యంపై చేశారని వెంకటాచలం ఎంపిడిఓ సరళ ఫిర్యాదు చేయగా దానిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాచలం మండలంలోని గొలగమూడి వద్ద ఓ ప్రైవేటు లే అవుట్ కు సంభందించి పంచాయితీ పైప్ లైన్ కనెక్షన్ కావాలని తనకు ధరఖాస్తు చేసుకున్నారని గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాలు తదితర అంశాల్లో తాను తీరిక లేకుండా ఉంటడంతో వారి ధరఖాస్తును పరిశీలించడం ఆలస్యమైందన్నారు. ఈనెల 1వ తేదీ నా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ లో తనను బెదిరించారని శుక్రవారం రాత్రి ఏకంగా కల్లూరు పల్లిలోని తన నివాసం వద్దకు వచ్చి కరెంటు తీసివేయించారని ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులను బెదిరించి వెళ్లారని ఎంపిడిఓ సరళ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!