November 12, 2019

శివారు ప్రాంతాల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటన – వసతుల కోసం కలెక్టర్, కమీషనర్ కు విన్నపం

Clock Of Nellore ( Nellore ) – రెండు రోజుల నుండి నెల్లూరులో కురుస్తున్న వర్షాలకు నగర శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం ఉదయం శివారు ప్రాంత కాలనీల్లో పర్యటించారు. కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం లేదని తెలుసుకుని అధికారులుతో మాట్లాడారు. కాలనీ వాసుల అవసరాలు తెలుసుకుని అక్కడి నుండి జిల్లా కలెక్టర్ ఎమ్.వి.శేషగిరి బాబు, నగర పాలకసంస్థ కమీషనర్ పివివిఎస్ మూర్తి వద్దకు వెళ్లి మాట్లాడారు. వర్షాల వల్ల శివారు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వెంటనే వాటిని పరిష్కరించాలని కోరగా స్పందించిన కలెక్టర్, కమీషనర్ లు తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు వచ్చినప్పుడు శివారు ప్రాంతాలు జలమయమవుతున్నాయని అన్నారు. దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇప్పటికిప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోమని అధికారులను కోరామని, వర్షాలు తగ్గిన తర్వాత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతామని గిరిధర్ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!