November 21, 2019

అభివృద్ధి పేరుతో నగరాన్ని ధ్వంసం చేశారు – టిడిపిపై మండిపడ్డ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – గత టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నెల్లూరు నగరాన్ని ధ్వంసం చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫలితంగా నగర రహదారులు గుంతలుగా మారాయని, మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారాయని అన్నారు. 38వ డివిజన్ పరిధిలోని నీలగిరి సంఘంలో ఆయన శనివారం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగు కాలువలు పరిశీలించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం అభివృద్ది అంటూ రహదారులను గుంతల మయం చేశారని, అనేక చోట్ల మ్యాన్ హోల్స్ వేయకుండా వదిలేశారని అన్నారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయిస్తామని చెప్పారు. అలాగే అన్నీ కాలువల్లో పూడిక తీయించి, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్ఠి పెడుతున్నట్లు వివరించారు. పందులు, ఆవులు జనావాసాల్లో తిరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దెబ్బతిన్న రోడ్లను సరిచేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించి ఉన్నారని గుర్తు చేశారు. నీలగిరి సంఘంలో గత 25 ఏళ్ల ముందు నిర్మించిన డ్రైన్ల స్థానంలో కొత్త డ్రైన్లు నిర్మించనున్నామని వెల్లడించారు.

అలాగే ఆయన 22వ డివిజన్ లో కూడా పర్యటించారు. స్థానిక వైసీపి ఇంఛార్జ్ మొయిళ్ల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన మీ ఇంటికి – మీ ఇంఛార్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. డివిజన్ వైసీపి ఇంఛార్జ్ లు ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంకు కృషి చేస్తారని చెప్పారు. స్థానికులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే డివిజన్ ఇంఛార్జ్ లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!