November 19, 2019

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో అభివద్ది చేస్తా – గిరిధర్ రెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన 26వ డివిజన్ పరిధిలోని బుజబుజనెల్లూరులో పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. స్మశాన సమస్య ఆయన దృష్ఠికి రాగా వెంటనే దానిపై స్పందించిన గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా దాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శివారులో ఉన్న బుజబుజనెల్లూరుకు అన్నీ హంగులు కల్పిస్తామని చెప్పారు. పలు అభివృద్ధి పనులపై ఆయనతో వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు. బుజబుజ నెల్లూరు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతుందని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!