November 12, 2019

దోమల నివారణకు చర్యలు చేపట్టండి – అధికారులను కోరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – వర్షాకాలం మొదలవుతున్న నేపద్యంలో దోమల వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని, వాటి వల్ల ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. నెల్లూరులోని 37వ డివిజన్ లో ఆయన పర్యటించి కాలువల్లో ఆయిల్స్ బాల్స్ ను వేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకారం మొదలవుతున్న నేపద్యంలో దోమల వ్యాప్తి అధికం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే రోడ్లపై చెత్త తొలగించే విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. డ్రైనేజీ కాలువల్లో తీసిన పూడికను త్వరతగతిన తరలించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, నాయకులు బర్నాబాస్, గౌస్ బాషా, లక్ష్మణరావు, ఆనంద్, రహంతుల్లా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!