November 19, 2019

రేపు రైతు భరోసాపై అవగాహన సదస్సు – అధికారులతో సమీక్ష నిర్వహించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన శనివారం ఉదయం 9.30 గంటలకు నెల్లూరులోని కస్తూర్భా కళాక్షేత్రంలో రైతు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసాపై ఆయన శుక్రవారం సాయంత్రం నెల్లూరులోని ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో తహసీల్ధార్, విఆర్వోలు, వ్యవసాయశాఖ ఏడి, ఏఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకం ప్రతీ ఒక్క రైతుకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఉదయం జరిగే సదస్సులో సందేహాలు ఉండే నివృత్తి చేసుకోవచ్చునని రైతులకు సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు అక్కడికక్కడే పరిష్కరిస్తారని వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!