November 22, 2019

పోలీస్ కాలనీలో గిరిధర్ రెడ్డి ప్రజాబాట – సమస్యల పరిష్కారానికి హామీ

Clock Of Nellore ( Nellore ) – స్థానికి 31వ డివిజన్ పరిధిలోని పోలీస్ కాలనీని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. పోలీస్ కాలనీ ప్రాంతంలో ఆదివారం గిరిధర్ రెడ్డి ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం స్పందించిన గిరిధర్ రెడ్డి అక్కడి నుండే అధికారులతో మాట్లాడారు. నిర్ణీత సమయం లోగా సమస్యలను పరిష్కరించారని సూచించారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ది పేరుతో రోడ్లను గుంతల మయం చేసి అలాగే వదిలేశారని మండిపడ్డారు. గుంతల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రోడ్లను బాగు చేసేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని గుర్తు చేశారు. అది కాకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్ఠి పెట్టామని, అన్నీ కాలువల్లో పూడిక తీయించి ఆయిల్ బాల్స్ వేయిస్తున్నామని వివరించారు. పోలీస్ కాలనీని మోడల్ కాలనీగా మార్చేందుకు కృషి చేస్తానని గిరిధర్ రెడ్డి స్థానికులకు హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!