November 19, 2019

గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే రోడ్లకు ఈ దుస్థితి – విమర్శించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – గత టిడిపి ప్రభుత్వం చేపట్టిన అస్థవ్యస్థ పనుల కారణంగానే నెల్లూరులో అనేక చోట్ల రోడ్లు గుంతల మయంగా మారాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33, 34 డివిజన్లలో విస్త్రృతంగా పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ కోసం రోడ్లల్లో గుంతలు తవ్వి వదిలేని వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మున్సిపల్ కార్పొరేషన్ ఎస్.ఈ ఇమామ్ మొహిద్ధీన్ కలిసి దానిపై చర్చించారు. అనేక చోట్ల రోడ్లు గుంతల మయంగా ఉన్నాయని చెప్పారు. అలాగే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ లేవని దాని కారణంగా అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని వివరించారు. వర్షాకాలంలో వాటి వల్ల ప్రజలు మరింత ఇబ్బంది ఎదుర్కొంటారని వెంటనే వాటిని సరిచేయాలని ఎస్ఈని కోరారు. అంతే కాకుండా అన్నీ కాలువల్లో పూడిక తీయించాలని, పారిశుధ్యంపై దృష్ఠి సారించి ప్రజలు విష జ్వరాల బారిన పడుకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గిరిధర్ రెడ్డి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్ఈ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా అనేక పనులు నిర్వహించిందని ఫలితంగా రోడ్లు గుంతలుగా మారాయని చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!