November 22, 2019

23, 28 డివిజన్లలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటన – ప్రజా సమస్యలపై ఆరా

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 23, 28వ డివిజన్లలో ఆదివారం పర్యటించారు. 23వ డివిజన్ పరిధిలోని పాత వేదాయపాళెం, జనశక్తి నగర్ లో ఆయన ప్రజాబాట పేరుతో ఇంటింటికి వెళ్లారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించారని అధికారులకు సూచించారు. అలాగే దోమల నివారణకు మురుగు కాలువలు, గుంతలలో ఆయిల్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా అనేక చోట్ల నీరు నిలిచిపోయి ఉందని చెప్పారు. వాటి వల్ల దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆయిల్స్ బాల్స్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, 23వ డివిజన్ ఇంఛార్జ్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం 28వ డివిజన్ లో స్థానిక వైసీపి ఇంఛార్జ్ భీమినేని మురహరి తల పెట్టిన ఇంటింటికి వైసీపి కార్యక్రమాన్ని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కర పత్రాలను పంపిణీ చేశారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులు సమస్యలను డివిజన్ ఇంఛార్జ్ దృష్ఠికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!