November 22, 2019

నెల్లూరు రూరల్ ప్రజలకు ధన్యవాదాలు – విలేకరుల సమావేశంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా సభను విజయవంతం చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రైతులు, వైసీపి నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. బుధవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతిష్ఠాత్మక రైతు భరోసా ప్రారంభ సభ నెల్లూరు జరగడం జిల్లా వాసులకు గర్వకారణమని అభివర్ణించారు. ఈ సభకు నెల్లూరు రూరల్ నుండి అత్యధిక మంది రైతులు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎంతో అభిమానంతో ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా మొత్తాన్ని 50వేల నుండి 67,500 రూపాయలకు పెంచి రైతులపై తనకున్న అభిమానాన్ని ముఖ్యమంత్రి చాటుకున్నారని వెల్లడించారు. సిఎం సభను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయనతో పాటూ వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్, నేతలు బెజవాడ మేఘనాథ్ సింగ్, బర్నాబాస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!