November 19, 2019

మీ ఇంటికి… మీ డివిజన్ ఇంఛార్జ్ – ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని 27వ డివిజన్ లో మీ ఇంటికి… మీ డివిజన్ ఇంఛార్జ్ కార్యక్రమం మొదలైంది. స్థానిక వైసీపి డివిజన్ ఇంఛార్జ్ బూడిద పురుషోత్తం యాదవ్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన పురుషోత్తం యాదవ్ తో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్నీ డివిజన్లలో స్థానిక వైసీపి ఇంఛార్జ్ లు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!