November 21, 2019

రైతు భరోసా ప్రతీ రైతుకు చేరాలి – అధికారులను కోరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) – రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ప్రతీ రైతుకీ చేరాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులకు సూచించారు. నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామ సచివాలయంలో పాత వెల్లంటి, కొత్త వెల్లంటి, సజ్జాపురం, గొల్ల కందుకూరు, సౌత్ మోపూరు గ్రామ రైతులు, అధికారులతో ఆయన శుక్రవారం ఉదయం రైతు భరోసా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతీ ఒక్క రైతుకీ ఈ పథకం చేరాలని తహసీల్ధార్, విఆర్వోలు, వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. రైతు భరోసా పథకం రైతులకు సంజీవిని లాంటిదని చెబుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ పథకానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైతులకు బాసటగా నిలుస్తున్నారని గిరిధర్ రెడ్డి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!