November 21, 2019

ఆటో నగర్ ను అభివృద్ది చేయండి – మంత్రి గౌతమ్ రెడ్డిని కోరిన గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఏపిఐఐసి పరిధిలో ఉండే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆటో నగర్ ను అభివృద్ధి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి… రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కోరారు. ఐఏబి సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం నెల్లూరుకు విచ్చేసిన మంత్రిని వారి నివాసంలో గిరిధర్ రెడ్డి కలిసి ఆటో నగర్ పరిస్థితిని వివరించారు. ఎంతో మందికి ఉపాధి చూపించే ఆటో నగర్ లో రోడ్లు సరిగా లేవని, డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందని మంత్రి దృష్ఠికి తీసుకెళ్లారు. ఆటో నగర్ పై ప్రత్యేక చొరవ చూపి అభివృద్ది చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన గౌతమ్ రెడ్డి … ఆటో నగర్ పరిస్థితిని ఏపిఐఐసి అధికారుల దృష్ఠికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని గిరిధర్ రెడ్డికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!