November 22, 2019

వైసీపిలోకి వచ్చిన ప్రతీ ఒక్కరికీ సముచిత స్థానం – వెల్లడించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతీ ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భరోసా ఇచ్చారు. నెల్లూరు 24వ డివిజన్ కు చెందిన కే.పి. సుధీర్ కుమార్ కార్యకర్తలతో కలిసి వైసీపిలో చేరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరురూరల్ లో అన్నీ పార్టీ నాయకులను వైసీపికి ఆహ్వానిస్తున్నానని అన్నారు. పార్టీలోకి వచ్చే ప్రతీ ఒక్కరికీ గౌరవ స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు బాగుంటేనే పార్టీ కూడా బాగుంటుందని అందుకే తాము కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉన్న ప్రతీ ఒక్కరి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!