November 16, 2019

సిఎం రైతు భరోసా సభకు 25వేల మంది – ప్రకటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఈనెల 15వ తేదీ జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా సభకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి 25 వేల మంది హాజరుకానున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యి జన సమీకరణపై చర్చించారు. నియోజకవర్గంలోని రైతులు, వైసీపి కార్యకర్తలు, ప్రజలు సిఎం సభకు హాజరయ్యేలా దృష్ఠి సారించాలని నేతలకు సూచించారు. 25వేల మందికి తగ్గకుండా సిఎం సభకు ప్రజలు హాజరుకావాలని వెల్లడించారు. ఇందు కోసం 300 బస్సులు, 200 ట్రాక్టర్లు, 2వేల ఆటోలు కేటాయిస్తున్నట్లు కోటంరెడ్డి ప్రకటించారు. జనసమీకరణ, తరలింపు తదితర అంశాలకు సంభందించి నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!