November 19, 2019

పుట్టిన రోజు సందర్భం… తల్లి చేత్తో గోరు ముద్దలు తిన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి….

Clock Of Nellore ( Sangam ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని స్వస్థలంకు వెళ్లారు. సంగం మండలం, పడమటిపాళెంలోని సొంతింటికి వెళ్లి తల్లి ఆశీస్సులు అందుకున్నారు. తల్లిచేతి వంట ఆరగించారు. తల్లిచేతి గోరుముద్దలు తీని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి, ప్రజా ఉద్యమాలతో చిన్నతనం నుంచే తాను కుటుంబానికి దూరంగా ఉన్నానని చెప్పారు. పదవులు, డబ్బులు శాశ్వతం కావని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రేమే శాశ్వతం అని అన్నారు ఎమ్మెల్యే. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా తమ పుట్టినరోజు సందర్భంగా అయినా తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారితో కొంత సమయం గడపాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!