November 21, 2019

రైతు భరోసా గడువు పెంచండి – మంత్రిని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ రైతు భరోసా ధరఖాస్తు గడువును మరో రెండు వారాల పాటూ పొడిగించాలని కోరుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కోరారు. నెల్లూరులోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో బుధవారం ఉదయం మంత్రిని కలిసిన కోటంరెడ్డి వినతి పత్రం అందజేశారు. రైతు భరోసా ధరఖాస్తు గడువు ఈనెల 15తో ముగియనుందని గుర్తు చేశారు. అయితే చాలా మంది రైతులు ప్రజా సాధికార సర్వేలో తమ వివరాలు ఇంకా నమోదు చేసుకోకపోవడం, ఆధార్ లింక్ కాకపోవడంతో వారికి ఖాతా నంబర్లు రాలేదని చెప్పారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. మరో రెండు వారాలు గడువు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మురళీ కృష్ణయాదవ్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!