November 19, 2019

సిఎం జగన్ నెల్లూరు సభ విజయవంతానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి త్రిశూల వ్యూహం

Clock Of Nellore ( Nellore ) – బాహుబలి చిత్రంలో మాయిష్మతి రాజ్యంపై కాలకేయులు దండెత్తినప్పుడు వారిని తరిమికొట్టేందుకు శివగామి నేతృత్వంలో బాహుబలి, బల్లాలదేవుడు అనుసరించిన త్రిశూల వ్యూహం అందరికీ తెలిసే ఉంటుంది. త్రిశూల వ్యూహం ప్రకారం శత్రు సైన్యంపై దండెత్తిన బాహుబలి, బల్లాలదేవుడు చివరకు కాలకేయుణ్ని వధించి యుద్ధంలో విజయం సాధిస్తారు. సిఎం జగన్ ఈనెల 15న నెల్లూరులో నిర్వహించనున్న రైతు భరోసా సభను విజయవంతం చేసేందుకు అదే త్రిశూల వ్యూహాన్నివేరే పద్దతిలో అమలు చేస్తున్నారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంభందించి సిఎం సభకు 25వేల మందిని హాజరుపరిచేలా ఆ వ్యూహాన్ని ఇప్పటికే అమల్లో పెట్టారు. భారీగా జన సమీకరణ చేసి త్రిశూల వ్యూహంతో సభా స్థలికి చేరుకునేలా ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రణాళికను సిద్దం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం రైతు భరోసా సభకు రూరల్ నియోజకవర్గం నుండి 300 బస్సులు, 150 ఆటోలు, 200 ట్రాక్టర్లలో జనాన్ని తరలించేందుకు రంగం సిద్దం చేశారు. 15వ తేదీ ఉదయం నెల్లూరులోని మూడు వేరు వేరు ప్రాంతాల నుండి ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాల నుండి తరలి వచ్చే బస్సులు కనుపర్తి పాడు జాతీయ రహదారి వద్ద నిలవనున్నాయి. 150 ఆటోలు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంకు చేరుకుంటాయి. ఇక గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే 200 ట్రాక్టర్లు బారాషహీద్ దర్గా ప్రాంగణానికి చేరుకుంటాయి. అనంతరం మూడు ప్రాంతాల నుండి ఆయా వాహనాల్లో ప్రజలు ఒకే సమయానికి రైతు భరోసా సభా వేదిక విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగాణానికి చేరుకుంటారు. 25వేల మంది జనంకు తగ్గకుండా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నడంతో సిద్ధహస్తుడైన కోటంరెడ్డి జగన్ సభ కోసం ఈ త్రిశూల వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఆయన ఆలోచనకు హ్యాట్సాఫ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!