November 16, 2019

సమాన్య భక్తుడిలా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి – ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Clock Of Nellore ( Nellore ) – విజయదశమి పర్వదినాన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నెల్లూరు దర్గామిట్టలోనున్న దేవస్థానానికి చేరుకున్న ఆయన ఎలాంటి హంగూ… ఆర్భాటాలు లేకుండా సామాన్య భక్తుని మాదిరిగా క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. మహిళా భక్తలచే ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు తన వల్ల ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతో గత ఐదేళ్లుగా ఇదే మాదిరిగా అమ్మవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. దేవస్థానాల్లో రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడా ఫ్లెక్సీలను అనుమతించలేదన్నారు. దేవస్థాన ఉత్సవ కమిటిని కూడా అలాగే నియమించామని వివరించారు. ఉత్సవ కమిటియే ట్రస్టు బోర్డుగా ఉండబోతుందన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అంటే తనకెంతో నమ్మకమని చెబుతూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!