November 19, 2019

నాపై కేసు ఖచ్చితంగా కుట్రే – ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – తనపై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్పీడిఓ కేసులో అరెస్టయ్యి బెయిల్ పొందిన తర్వాత ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని వివరణ ఇచ్చారు. వెంకటాచలం మండలంలో అన్నీ అనుమతులు ఉన్న ఓ లే అవుట్ కు వాటర్ పైప్ లైన్ కనెక్షన్ మంజూరు విషయంలో ఎమ్పీడిఓ సరళతో మాట్లాడానను అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ సారి అడగ్గా చేస్తానని సమాధానమిచ్చిందన్నారు. అయితే ఎంతకీ ఆ పని చేయకపోవడంతో ఫోన్ చేసి అడగ్గా స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవ్వొద్దని చెప్పిందన్నారు. అంతకు మించి ఆమెతో తాను ఏమీ మాట్లాడలేదన్నారు. నేనేదో వారింటికి వెళ్లి దౌర్జన్యం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిందని తాను దౌర్జన్యం చేస్తే పక్కనున్న ఇండ్ల వారికి తెలియదా అని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకముందు ఎమ్పీడిఓ సరళ ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. వెంకటాచలం మండల వైసీపి కన్వీనర్ ప్రదీప్ రెడ్డితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారన్నారు. ప్రదీప్ రెడ్డి పోలీసులను దుర్భాషలాడినా చర్యలు లేవన్నారు. ప్రదీప్ రెడ్డి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడని గుర్తు చేశారు. దీని వెనుక ఎవరి కుట్ర దాగి ఉందో అందరికీ తెలుసునన్నారు. ఈ కేసు విషయంలో తాను ఎలాంటి పొరపాటూ చేయలేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్పీడిఓ సరళ కేవలం పాత్రధారి మాత్రమేనని, సూత్రధారులు వెనుక ఉన్నారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!