November 19, 2019

అసత్య కథనాలపై చర్యలు తీసుకోండి – జేసిని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఓ వార పత్రికలో తనపై అసత్య కథనాలతో వార్తను ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ను కోరారు. శనివారం ఉదయం జేసీని కలిసి కోటంరెడ్డి వార పత్రికలో ప్రచురితమైన వార్తను అందించారు. అలాగే దానిపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం అందజేశారు. అధికారులు, పోలీసుల సహకారంతో తాను ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు వార్తను ప్రచురించారని చెప్పారు. జాయింట్ కలెక్టర్ తో తాను మాట్లాడినట్లు వార్తలో రాసారన్నారు. దానికి స్పందించిన జేసీ మీరెప్పుడూ నాకు ఫోన్ చేయలేదే… అని మీడియా ఎదుటే అన్నారు. వార్తా కథనంపై విచారణ జరిపి నా తప్పు ఉంటే కేసు నమోదు చేయాలని, పత్రిక తప్పయితే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!