October 19, 2019

విభేధాలు సమసిపోయాయి… రైతు భరోసా సభను సక్సెస్ చేయడమే లక్ష్యం… ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Amaravathi ) – సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, చిన్నచిన్నవి ఉన్నా అవి సమసిపోయాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అందుబాటులో ఉన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో వైసీపి ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం అమరావతిలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్పీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వర ప్రసాద్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 15వ తేదీనా నెల్లూరులో జరిగే రైతు భరోసా ప్రారంభ సభ విజయవంతం అయ్యేలా పనిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు వారికి చెప్పారు. అంతే కాకుండా వివిధ అంశాలపై మాట్లాడారు. కోటంరెడ్డి… కాకాణి మధ్య జరుగుతున్న వివాదంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశం అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి తనకు స్వయానా బావ అని అంటూ మా మధ్య ఎలాంటి విభేదాలు లేదని స్పష్టం చేశారు. ఎమ్పీడిఓ కేసులో కొన్ని అనుమానాలు మాత్రం వ్యక్తం చేశానన్నారు. గతం గతహా… అంటూ తమ లక్ష్యం ఈ నెల 15న నెల్లూరులో జరిగే రైతు భరోసా సభను విజయవంతం చేయడమేనన్నారు. 16వ తేదీ నుండి అమరావతిలోనే ఉంటానన్నారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైసీపిలో ఎలాంటి విభేధాలు లేవన్నారు. రైతు భరోసా సభపైనే సమావేశంలో చర్చించినట్లు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!