December 16, 2019

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు దర్గామిట్టలోని ప్రసిద్ధ గాంచిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సతీమణి సుజిత మరియు మనుమరాలితో ఆలయానికి చేరుకున్న కోటంరెడ్డికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి వేద మంత్రోచ్చరణల మధ్య పట్టు వస్త్రాలను ప్రదర్శనగా తీసుకెళ్లి అమ్మవారి గర్భగుడిలో సమర్పించారు. తదుపరి కోటంరెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఉత్సవ కమిటి సభ్యులు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయా డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసిపి నేత సన్నపురెడ్డి పెంచలరెడ్డి, ఉత్సవ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!